Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : కేటీఆర్ కి పని పాట లేక మిర్యాలగూడ వచ్చాడు.. ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

కేటీఆర్ కి పని పాట లేక మిర్యాలగూడ వచ్చాడు, రైతు ధర్నా చెయ్యాల్సిన అవసరం ఏముంది అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Miryalaguda : కేటీఆర్ కి పని పాట లేక మిర్యాలగూడ వచ్చాడు.. ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

మిర్యాలగూడ, మన సాక్షి :

కేటీఆర్ కి పని పాట లేక మిర్యాలగూడ వచ్చాడు, రైతు ధర్నా చెయ్యాల్సిన అవసరం ఏముంది అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నీళ్ల పేరు తో నికృష్ట రాజకీయాలు చేస్తున్నాడని, మిర్యాలగూడ రైతులకు వరి పంట పండించడం కేసీఆర్, జగదీశ్ రెడ్డి నేర్పించినట్లు కేటిఆర్ బడాయి కబుర్లు చెపుతున్నడని అన్నారు. నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, మిర్యాలగూడ రైతులకు దశాబ్దాలు గా నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతం రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా మారింది కాంగ్రెస్ వళ్ల అన్నారు.

నీళ్ల గురించి బీఆర్ ఎస్ అనే బచ్చా పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని, కేటీఆర్ తాతకు దగ్గులు నేర్పాలని చూస్తున్నాడని
సాగర్ నుంచి నీళ్లు ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసు అన్నారు.

రైతు జీవితంతో మేము మీ లా రాజకీయం చేయమని, ఎల్ నీ నో ప్రభావం తో ఈ సారి వర్షాలు పడలేదు.. ఈ ఏడాది అంతా ఈదే పరిస్థితి ఉంటుందని చెపుతున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు నీరు కంటే తాగు నీరు ముఖ్యం..అందుకే ఆరు తడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందన్నారు.

రైతులు కూడా వాతావరణ పరిస్థితుల కు అనుగుణంగా పంటలు వేస్తున్నారు.
కానీ బీఆర్ ఎస్ మాత్రం రైతులను రెచ్చగొడుతుంది.. వాళ్ళు పంటలు వేసుకోవాలి.. నీళ్లు లేక ఎండి పోయి ఆత్మహత్య లు చేసుకోవాలన్నదే బీఆర్ ఎస్ ఆలోచన అన్నారు. రైతుల శవాల పైన రాజకీయం చేసే వోట్ లు సంపాదించు కోవాలి.. ఈదే కేటీఆర్ ఆలోచన అన్నారు.

రుణమాఫీ చేశాం.. రైతు భోరోసా ఇస్తున్నాం..మద్దతు ధరకు పంట కొన్నాం..వరికి బోనస్ ఇస్తున్నాం.. కేవలం రైతుల కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం మాది అన్నారు. సమావేశం లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , డీసీసీ కార్యదర్శి చిలుకూరి బాలు ఉన్నారు.

మరిన్ని వార్తలు