Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : కేటీఆర్ కు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్..!
కేటీఆర్ నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, మిర్యాలగూడ రాజీవ్ గాంధీ సెంటర్ లేదా నల్గొండ క్లాక్ టవర్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్ చేశారు.

Miryalaguda : కేటీఆర్ కు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
కేటీఆర్ నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, మిర్యాలగూడ రాజీవ్ గాంధీ సెంటర్ లేదా నల్గొండ క్లాక్ టవర్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మిర్యాలగూడలో 25,703 మంది రైతులకు రూ. 197 కోట్ల రుణమాఫీ లబ్ధి జరిగిందని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రూ. 2,005 కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు.
సాగర్ కాలువల ద్వారా 9,000 క్యూసెక్కుల నీరు విడుదల చేసి చివరి పైరు వరకు నీరందిస్తామని, రూ. 1,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం, ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. సమావేశం లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి ఉన్నారు.









