నల్గొండ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ముందస్తు అరెస్టులు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్, నియోజకవర్గ పర్యటనకు వస్తుండడంతో బి ఆర్ ఎస్ నాయకులను శనివారం అర్వపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

నల్గొండ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ముందస్తు అరెస్టులు..!
అర్వపల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్, నియోజకవర్గ పర్యటనకు వస్తుండడంతో బి ఆర్ ఎస్ నాయకులను శనివారం అర్వపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ జెడ్పిటిసి దావుల వీర ప్రసాద్ యాదవ్ ను ఉదయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలను మభ్యపెడుతున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. రైతులకు కరెంటు ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రస్తుతం 9 గంటల కూడా త్రీఫేస్ కరెంటు రావడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నట్లు తెలిపారు.
త్వరలోనే పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కరెంట్ సరఫరా పై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. వర్షాలు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే కరెంటు కోతలతో మూలిగె నక్కపై, తాటి పండు పడ్డచందంగా కరెంట్ కోతలు చేస్తున్నారని అన్నారు.
వీరితోపాటు గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టెల మల్లేష్ ముదిరాజ్, నాయకులు కడారి నరేష్, పులిచెర్ల ప్రభు, మామిడి సైదులు, ఎల్లముల శ్రీకాంత్, మనుబోతుల నరేష్ దా వు ల గోపాల్ కడారి రాంబాబు బింగి సాయి తదితరులు పాల్గొన్నారు
బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకరికల్లు నియోజకవర్గం పర్యటనలో భాగంగా అర్వపల్లి మండల బిజెపి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు వీరిన సీనియర్ బిజెపి నాయకులు మారపాక రాములు, జిన్నా అశ్విన్ ముదిరాజ్, పాల్గొన్నారు









