Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsమహబూబ్‌నగర్వ్యవసాయం

Seeds : రైతులకు బ్రీడర్ విత్తనాల పంపిణీ..!

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నాబార్డ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న ప్రాజెక్టు బ్రీడర్ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

Seeds : రైతులకు బ్రీడర్ విత్తనాల పంపిణీ..!

హన్వాడ, మన సాక్షి:

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నాబార్డ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న ప్రాజెక్టు బ్రీడర్ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతు సేవా సహకార సంఘం చైర్మన్ ఇంటెనికి కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి నాణ్యమైన విత్తనాలు ఎంతో కీలకం, రైతులకు మెరుగైన దిగుబడులు, అధిక ఉత్పాదకత అందించాలనే లక్ష్యంతో బ్రీడర్ విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు.

ఒక్క పిఏసిఎస్ కు ఐదు ఎకరాలకు బ్రీడ్ విత్తనాలు ఒక్కో బ్యాగు 15 కిలోల చొప్పున ఏడు బస్తాలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ నుండి కొనడం జరిగిందని వారు వివరించారు. పిఎసిఎస్ హన్వాడ లో అడ్మిషన్ ఉన్న రైతులకు ఎంపిక చేసిన వారికి మాత్రమే ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీనివాసులు, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు