Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం.. భర్తను హత్య చేసిన భార్య..!

అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను భార్య హత్య చేసింది.

మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం.. భర్తను హత్య చేసిన భార్య..!

మహబూబ్ నగర్ జిల్లా – గోపాల్ 
(మన సాక్షి ప్రతినిధి )

అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను భార్య హత్య చేసింది. మహబూబ్ నగర్ 2 టౌన్ సీఐ మహమ్మద్ ఏజాజోదిన్, తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట్ మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన పెద్దమోని శీను ( 50) లక్ష్మమ్మ తో 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది. ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం కూలి పని కోసం మహబూబ్ నగర్ లోని హనుమాన్ నగర్, కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తూ గత కొంతకాలం నుంచి తాగుడుకు బాని సై భార్య లక్ష్మమ్మ మహబూబ్ నగర్ కు చెందిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నది.

విషయం గమనించిన భర్త కు భార్య లక్ష్మమ్మ పై అనుమానం వచ్చిన తరచూ గొడవ పడేవాడు. దాని అలుసుగా తీసుకొని అక్టోబర్ 19 సోమవారం సాయంత్రం 7 గంటలకు ఇద్దరు కలిసి మద్యం సేవించి భర్త, భార్యను పై విషయాలపై నిలదీయగా ఎలాగైనా భర్తను చంపి తన అక్రమ సంబంధాలను కొనసాగించుకోవచ్చని ఉద్దేశంతో, మద్యం తాగించి కింద పడిన భార్య మర్మాంగాలను పిసికి అక్కడే ఉన్న అద్దంను పగలగొట్టి అద్దం ముక్కలతో మర్మాంగాలను దాడి చేసి మరియు ఎడమ కన్ను పైన పొడవగా రక్త గాయాలయి చనిపోయాడు.

అప్పుడే చిన్న కొడుకును ఇంటికి వస్తుండగా చూసి ఇంట్లో నుండి పారిపోయినది. పరారీలో ఉన్న నిందితురాలను మహబూబ్నగర్ లోని బస్టాండ్ లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు గుర్తించి రిమాండ్ కు తరలించినట్లు 2 టౌన్ సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు