Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డిహైదరాబాద్
లింగంపల్లి రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి..!
లింగంపల్లి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నెం.6 వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

లింగంపల్లి రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి..!
శేరిలింగంపల్లి, మన సాక్షి
లింగంపల్లి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నెం.6 వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు అనారోగ్యంతో పాటు సకాలంలో తగిన ఆహారం అందకపోవడం వల్ల మృతి సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడిని ఎవరైనా గుర్తించినా లేదా అతని వివరాలు తెలిసిన వెంటనే చందానగర్ పోలీస్ స్టేషన్ 8712567229 లేదా 8712567926 నెంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









