ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం..!
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్న యువతకి అబ్దుల్ ఖాదర్ అనే జిమ్ ట్రైనర్ ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపి ఆమె అధిక బరువుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు.
తను ఎలాగు జిమ్ ట్రైనర్ కాబట్టి బరువు తగ్గడంలో సలహాలు ఇస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన ఆమె అతడు ఏం చెప్పినా సరేనా అన్నది. ఈ క్రమంలో డైట్ గురించి చెప్తానని ఓ ప్రైవేట్ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ముందుగా బరువు తగ్గాలంటే ఈ షేక్ తాగాలంటూ ఒక షేక్ లో మత్తుమందు కల్పించాడు.
ఆ విషయం తెలియక దానిని తాగిన యువతీ స్పృహ కోల్పోయింది. ఆమెపై అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న ఫోటోలు తీశాడు. ఆమెకు స్పృహ వచ్చాక జరిగింది తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడైన ఖాదర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం కాలింపు చర్యలు చేపట్టారు.









