రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50 వేలు రాయితీ.. ఆయిల్ ఫామ్ తోటలకు దరఖాస్తులు..!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తున్న రైతులకు వివిధ దశలలో ఎకరానికి 50వేల రూపాయల చొప్పున రాయితీ అందించనున్నది. అందుకోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50 వేలు రాయితీ.. ఆయిల్ ఫామ్ తోటలకు దరఖాస్తులు..!
సూర్యాపేట, మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తున్న రైతులకు వివిధ దశలలో ఎకరానికి 50వేల రూపాయల చొప్పున రాయితీ అందించనున్నది. అందుకోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
వసతి ఉండి ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనీ అనుకునే రైతులు సంబంధిత ఉద్యాన, ఆయిల్ ఫెడ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూఆయిల్ ఫామ్ తోటలకు దరఖాస్తులు. సుర్యాపేట డివిజన్ ప్రాంతీయ ఉద్యాన అధికారిణి కట్ట స్వాతి ఒక ప్రకటన లో అన్నారు.2026-27 ఆర్థిక సంవత్సరానికి కోదాడ డివిజన్ కు 210 ఎకరాలు లక్ష్యం నిర్దేశించారని అందుకు అనుగుణంగా రైతుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు చేసుకునే రైతులకు ఒక ఎకరానికి మొక్కల నిమిత్తం 11001/- రూపాయలు, తోట యాజమాన్యం, అంతర పంటల కొరకు సంవత్సరానికి 4200/-చొప్పున నాలుగు సంవత్సరాలకు గాను 16800/- రూపాయలు, డ్రిప్ పరికరాలకు ఎకరాకు 22518/-రూపాయలచొప్పున మొత్తం 50918/- రూపాయలు రాయుతి లభిస్తుందని చెప్పారు.
ఆసక్తి ఉన్న రైతులు సూర్యాపేట, చివ్వేంల, పెన్ పహాడ్, ఆత్మకూరు ఎస్ మండల రైతులు ఉద్యాన విస్తరణ అధికారి యారాల సుధాకర్ రెడ్డి 7981693700నెంబర్ లోను, లేదా టీ జి ఆయిల్ ఫెడ్ ఆఫీసర్ భవిష్య
9121869703 నెంబర్ లను సంప్రదించాలని కోరారు. ఎల్ ని నో ప్రభావం ఉంది కావునా రైతులు వరికి ప్రత్యామ్నాయం గా ఆయిల్ పామ్ తోటలను సాగు చేసుకుని 30 సంవత్సరాల పాటు నెల నెల ఆదాయం పొందే అవకాశం ఉందని అన్నారు.