Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్.. 20|07|2026..!
మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. స్థానిక వార్తలు నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తలు అన్ని ఒకేచోట ఓకే క్లిక్ తో చదవండి.

Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్.. 20|07|2026..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. స్థానిక వార్తలు నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తలు అన్ని ఒకేచోట ఓకే క్లిక్ తో చదవండి.
—-
గంజాయి మత్తులో యువకుల బీభత్సం
తమిళనాడులోని సేలం-చెన్నై జాతీయ రహదారిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కారుతో వరుస ప్రమాదాలు సృష్టించారు. ఓ కారును ఢీకొట్టిన తర్వాత, టైరు ఊడిపోయి రిమ్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పులు చెరుగుతున్నా వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. స్థానికులు వెంబడించి కారును చుట్టుముట్టగా, ఇద్దరు పరారయ్యారు.
——-
హైదరాబాద్ పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
– కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్యానీ షా టేక్రీ దర్గా సమీపంలో ఘటన
– 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఫైజ్ మహ్మద్ (అజాన్)పై కత్తులతో దాడి
– తీవ్ర కత్తిపోట్లతో ఘటనాస్థలంలోనే మృతి చెందిన ఫైజ్ మహ్మద్
– మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు
– కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టిన కాలాపత్తర్ పోలీసులు
——
ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు
ఆర్థిక ఇబ్బందులను జయించి బిహార్‌లోని సహర్సా జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నీట్-యూజీ 2026లో అద్భుత ప్రతిభ చాటారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి రోహిత్ ఆనంద్ తమను ఖరీదైన కోచింగ్‌కు పంపలేకపోయినా, రజనీశ్, ప్రహ్లాద్, సాక్షి స్థానిక చిన్న కోచింగ్ సెంటర్లోనే చదువుతూ, పరస్పరం చర్చించుకుంటూ డాక్టర్ కలలను నిజం చేసుకున్నారు.
——-
గుండుగొలనులో గంగానమ్మ సంబరం
ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా గంగానమ్మ సంబరం నిర్వహించిన గ్రామస్థులు
గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో నీటిని తీసుకుని ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు చేరుకుని నిర్వహించిన పూజలు
అమ్మవార్లకు మహిళలు భక్తిశ్రద్ధలతో గంగాజలంతో అభిషేకాలు చేసి చెల్లించుకున్న తమ మొక్కుబడులు
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, పంటలు సమృద్ధిగా పండి రైతులకు మేలు జరగాలనే సంకల్పంతోనే ఈ సంబరం నిర్వహించినట్లు తెలిపిన గ్రామస్థులు
——–
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వైభవంగా బోనాల సమర్పణ
ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వెండి, బంగారు బోనాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, బ్యాండు చప్పుళ్ల నడుమ మురాద్ మహల్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు, భక్తుల కోలాహలం మధ్య ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
—–
టైటిల్ గెలుచుకున్న సంగ్రామ్ సింగ్
మలేషియాలో జరిగిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ‘స్ట్రైక్ ఏషియా ఛాంపియన్షిప్’ టైటిల్‌ను భారత ఫైటర్ సంగ్రామ్ సింగ్ కైవసం చేసుకున్నారు ఫైనల్ పోరులో పాకిస్థాన్ ఫైటర్ మహ్మద్ ఆబిద్ అలీని కేవలం 80 సెకన్లలోనే నాకౌట్ చేసి ఘన విజయం సాధించిన సంగ్రామ్త తన పంచ్‌లు, అద్భుతమైన పవర్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దెబ్బతీసి భారత పతాకాన్ని ఎగరేశారు. సరికొత్త రికార్డు సృష్టిస్తూ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని భారత ప్రజలందరికీ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించిన సంగ్రామ్ సింగ్
——-
ఫిఫా ఫైనల్లో ఘర్షణ..
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య ఘర్షణ తలెత్తింది. స్పెయిన్ సంబరాలు చేసుకుంటుండగా అర్జెంటీనా ప్లేయర్ లియాండ్రో పరేడెస్, ప్రత్యర్థి ఆటగాడు గావిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్‌ను కూడా కొట్టడంతో ఉద్రిక్తత పెరిగింది. రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేసినా పరేడెస్ శాంతించలేదు.
——









