Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

మహిళ ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు.. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.. ఆత్మహత్యయత్నం..!

హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తనను లైంగికంగా వేధించారని మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆరోపణలు చేశారు.

మహిళ ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు.. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.. ఆత్మహత్యయత్నం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తనను లైంగికంగా వేధించారని మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆరోపణలు చేశారు. ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మహిళ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పై కేసు నమోదు చేశారు.

అసభ్యకర మెసేజ్ లు పంపించారని, బూతులు తిట్టారని, మెడపై కత్తి పెట్టి బంధించి తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసి ప్రవర్తించారని ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి తన భర్తకు పంపించి బ్లాక్ మెయిల్ చేసేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

సొంతూరు కి వెళ్ళిన ఉదయ్ కృష్ణారెడ్డి :

ఇది ఇలా ఉండగా ట్రైనీ మహిళ ఐపీఎస్ ను వేధిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సొంతూరుకు వెళ్లారు. తన సొంతూరు శ్రీకాకుళం జిల్లా వెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 8 రోజులలోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోరినట్లు సమాచారం.
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

ట్రైనీ ఐపీఎస్ మహిళ తోటి అధికారిపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైననీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నం చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీస్ అకాడమీ నుంచి తాత్కాలికంగా అధికారులు సస్పెండ్ చేశారు. దాంతో తాను ఏ తప్పు చేయలేదంటూ వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి ఉదయ్ కృష్ణారెడ్డి పాల్పడ్డట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు