Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండసంక్షేమం

Nalgonda : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి.. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..! 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Nalgonda : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి.. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..! 

నల్లగొండ,, మనసాక్షి :

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ కార్పొరేషన్ లోని 10,11, 31, 32,,33,34,41 వ డివిజన్ లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.మహిళా సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలను అందజేస్తుందని తెలిపారు.మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఇప్పటికే కార్పొరేషన్ లో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

రానున్న రోజుల్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.అన్ని డివిజన్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ చీరలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 31 వ డివిజన్ కార్పొరేటర్ కౌసర్, 33 వ డివిజన్ కార్పొరేటర్ రేగట్టే అండాలు లింగస్వామి, 34వ డివిజన్ కార్పొరేటర్ ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, 37 వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, జానయ్య, నాయకులు దోనాల నాగార్జున రెడ్డి, నకిరేకంటి సైదులు,ఏడుదొడ్ల వెంకట్రాంరెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు