Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంతెలంగాణ

Good News : తెలంగాణలో ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. వారు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్ ను విద్యాశాఖ అంగీకరించింది.

Good News : తెలంగాణలో ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. వారు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్ ను విద్యాశాఖ అంగీకరించింది. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెగ్యులర్ టెట్ పరీక్షలకు అదనంగా ప్రత్యేక టెట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేవలం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసమే మరో రెండు అదనపు టెట్ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనున్నది. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ విభాగం అధికారికంగా మెమో జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు వెలబడ్డాయి.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి లేఖ తో పాటు పి ఆర్ టి యు టీఎస్, స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యేక టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని రకాల చర్యలను ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరిగా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు ఊరట ఇచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది. పదోన్నతులు లేదా సర్వీస్ లో కొనసాగడానికి టెట్ అర్హత సాధించాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉన్నందున ఈ అవకాశం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేస్తుంది. త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది.

మరిన్ని వార్తలు