Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ బస్టాండ్ ను సందర్శించిన ఆర్టీసీ ఎండి.. ఈ రుట్లలో బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే వినతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై నాగిరెడ్డి గురువారం సందర్శించారు. ఆర్టీసీ బస్టాండ్ తో పాటు డిపోను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Miryalaguda : మిర్యాలగూడ బస్టాండ్ ను సందర్శించిన ఆర్టీసీ ఎండి.. ఈ రుట్లలో బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే వినతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై నాగిరెడ్డి గురువారం సందర్శించారు. ఆర్టీసీ బస్టాండ్ తో పాటు డిపోను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ఆర్టిసి ఎండి నాగిరెడ్డిని కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పలు రూట్లలో బస్సులు నడపాలని కోరారు.

అదేవిధంగా మిర్యాలగూడ బస్ స్టాండ్ ను డిజిటల్ బస్టాండ్ గా ఏర్పాటు చేయాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గం లోని
మాడుగులపల్లి మండలానికి సంబంధించి
మిర్యాలగూడ నుంచి కుక్కడం, తోపుచర్ల, ఇసుకబావిగూడెం, పుచ్చకాయలగూడె, బొమ్మకల్, భీమనపల్లి, కల్వలపాలెం, పాములపాడు, సూర్యాపేట రూట్‌లో ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించగలరని కోరారు.

వేములపల్లి మండలానికి సంబంధించి
వేములపల్లి నుంచి అన్నపరెడ్డిగూడెం, గోగువారిగూడెం రూట్‌లో ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని,
ప్రస్తుతం వేములపల్లి, సల్కనూరు అడ్డరోడ్డు వరకు నడుస్తున్న బస్సును మంగాపురం వరకు పొడిగించాలని కోరారు.

అడవిదేవులపల్లి మండలానికి సంబంధించి
ముదిమాణిక్యం గ్రామానికి ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించగలరని కోరారు.

మిర్యాలగూడ మండలానికి సంబంధించి మిర్యాలగూడ, యాదగిరిపల్లి, కాల్వపల్లి, ఉట్లపల్లి, తక్కెళ్లపాడు, తడకమళ్ళ, కామేపల్లి వరకు, మిర్యాలగూడ, రుద్రారం, లక్ష్మీపురం, ఎర్రకాలువ, కేశవపురం, రామోజీ తండా వరకు, మిర్యాలగూడ, అవంతిపురం, ఆలగడప, రాయలపాలెం, ముల్కలకాల్వ, జాల్బాయి తండా వరకు, మిర్యాలగూడ, జప్తి వీరప్పగూడెం, జటావత్ తండా, అల్వాల్‌పాడు, బొర్రాయపాలెం, అన్నారం వరకు ఉదయం సాయంత్రం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయగలరు.

దామరచర్ల మండలం కేంద్రంగా దామరచర్ల, బొత్తలపాలెం, కల్లేపల్లి, గాంధీనగర్, తిమ్మాపురం, తూర్పు తండా, బడాయిగడ్డ, రాగడప వరకు, దామరచర్ల, గణేష్‌పాడు వరకు, దామరచర్ల, నునావత్ తండా, సాతండా, తెట్టకుంట , మంగళదుబ్బ తండా వరకు ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎండీ పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసారు.

మరిన్ని వార్తలు