Miryalaguda : పర్యావరణ పరిరక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోని 29 వ వార్డ్ బంగారుగడ్డ, 3వ వార్డ్ తాళ్ళగడ్డ వార్డులో పర్యావరణ వారోత్సవాల ప్రత్యేక వార్డు సభను నిర్వహించడం జరిగింది.

Miryalaguda : పర్యావరణ పరిరక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు..!
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వార్డు సభలో ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్
మిర్యాలగూడ, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోని 29 వ వార్డ్ బంగారుగడ్డ, 3వ వార్డ్ తాళ్ళగడ్డ వార్డులో పర్యావరణ వారోత్సవాల ప్రత్యేక వార్డు సభను నిర్వహించడం జరిగింది.
ఈ సభలకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,
మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, అధికారులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ద్వారా క్షేత్రస్థాయిలో వార్డులు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులోని ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వార్డు పరిధిలోని డ్రైనేజీల పూడికతీత పనులను, నీటి నిల్వలు లేకుండా యాంటీ- లార్వా ఆపరేషన్లను తక్షణమే చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ప్లాస్టిక్ రహిత వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీజ రెడ్డి, వార్డు కౌన్సిలర్స్ జావిద్,, బంటు పద్మ లక్ష్మీనారాయణ, వార్డు అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.










