Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Karimnagar : బండి సంజయ్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల తోపులాట, లాఠీఛార్జ్..!

కరీంనగర్ బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.

Karimnagar : బండి సంజయ్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల తోపులాట, లాఠీఛార్జ్..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ముట్టడి యత్నాన్ని ముందుగానే పసిగట్టిన బీజేపీ కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు కార్యాలయం వద్ద మోహరించి అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం నెలకొంది. వెనక్కి తగ్గిన కాంగ్రెస్ నేతలను బీజేపీ శ్రేణులు వెంబడించి, వారిపై దాడి చేయడానికి యత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని, ఘర్షణను అదుపులోకి తెచ్చారు.

అనంతరం నిరసనకు దిగిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరును నిరసిస్తూ, కాసేపట్లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతుండటంతో నగరంలో ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

By : Naresh, Karimnagar 

మరిన్ని వార్తలు