Nalgonda : నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు..!
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార చేసిన ముద్దాయిపై ఫోక్సో కేస్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు..!
కేతేపల్లి, మనసాక్షి.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార చేసిన ముద్దాయిపై ఫోక్సో కేస్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొప్పోలు గ్రామంలో శుక్రవారం మైనర్ బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాధిత బాలిక వేసవి సెలవుల నిమిత్తం తన అమ్మమ్మ ఇంటి వద్దకు వచ్చిందని, అదే గ్రామానికి చెందిన 19 సoవత్సరాల యువకుడు నాలుగు రోజుల క్రితం పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. గురువారం ఎవరు లేని సమయం లో బాలికను బెదిరించి బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చా యని, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంబిచామని కేతేపల్లి ఎస్ఐ యూత్ సతీష్ తెలిపారు.
ఘటనకు సంబంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. మైనర్ బాలికపై నేరం జరగడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేసి నామని, నిందితుడిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్.ఐ హామీ ఇచ్చారు.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.









