నెల రోజులుగా ధాన్యం కాంటాలు కాలేదు.. రైతుల ఎదురుచూపు..!
తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో రెండు నెలలు కావొస్తుంది. మేము ధాన్యం రాశులు కప్పి పెట్టుకోవడానికి పట్టాలు కిరాయి తెచ్చి రెండు నెలలు గడిచిన మా ధాన్యం కాంటాలు వేయడం లేదు అని మాలోతు సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు.

నెల రోజులుగా ధాన్యం కాంటాలు కాలేదు.. రైతుల ఎదురుచూపు..!
తుంగతుర్తి, మనసాక్షి :
తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో రెండు నెలలు కావొస్తుంది. మేము ధాన్యం రాశులు కప్పి పెట్టుకోవడానికి పట్టాలు కిరాయి తెచ్చి రెండు నెలలు గడిచిన మా ధాన్యం కాంటాలు వేయడం లేదు అని మాలోతు సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. తన వడ్ల రాసి దగ్గర చెత్త వడ్లు వడి పిల్లలతో కుప్పచేసి నిప్పి పెట్టుకోవడానికి అగ్గిపెట్టెను తీసుకొని నిప్పు పెట్టబోగా అతని పక్కన ఉన్న రైతులు అగ్గిపెట్టను లాక్కొని ఆవేశం వద్దు మన ధాన్యం పోకుండా మనం బతికి కొట్లాడాల కానీ రైతుగా మన బాధలు మండల అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు, జిల్లా అధికారులకు తెలిసినా కానీ మా ధాన్యం కొనుగోలు చేయడం లేదు.
కేంద్రాలలో ఇంకా 40 శాతానికి పైగా సొసైటీ వాళ్లు మా గ్రామంలో కొంటామని చెప్పడంతో మేము గొట్టిపర్తి గ్రామం వాళ్ళము ఇక్కడ ధాన్యం పోసామని నెల రోజుల నుండి ప్రాంతాలు వేస్తామని తక్షణమే ఎగుమతి చేస్తామని అధికారులు చెప్పడంతో మేము నమ్మి ఇక్కడ ధాన్యం పోస్తే రెండు నెలలు గడుస్తున్నాయి.
మృగశిర కార్తె కూడా వస్తుంది. మేము రేపో మాపో వర్షాలు పడితే మా ధాన్యం రాశులు ఎటు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నము. గ్రామ ప్రజలు. నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు. అటు నాలుగు రోజుల ముందు పలు మండలాలలో జిల్లా అధికారులు జిల్లా మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
నాలుగు రోజులలో మీ మండలాలలోని తాసిల్దారులు పోలీసుల ద్వారాలారీలు ఎక్కువగా పెట్టి ధాన్యాన్ని ఎగుమతి చేసిన వా టి కి తొందరగా దిగుమతి చేస్తామని చెప్పడమే తప్ప మా గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మా గ్రామంలో మూడు కొనుగోలు కేంద్రాలు సొసైటీకి ఇచ్చారు. గతంలో మహిళా సంఘాలు ఉన్నప్పుడే మంచిగా కాంటాలు చేసి దిగుమతులు అయ్యాయని మాకు డబ్బులు కూడా వారం పది రోజులలో వచ్చేవని, ఇప్పుడు రైతు సొసైటీ ప్రభుత్వ అధికారులు మంచిగా రైతులకు మేలు చేస్తుందని చెప్పి మాకు మోసం చేసినదని రైతులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే జిల్లా అధికారులు స్పందించి మా తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి గ్రామంలో ఎక్కువ పంట పండింది. అట్టి పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతు సొసైటీ ద్వారా తొందరగా కాంటాలు వేస్తామని చెప్పి మా గొంతు కోశారని ఇక్కడ ఉన్న రైతులు గుగులోతు హేమల రెండు నెలలు ధాన్యం పోసి పట్టా వాళ్ళు కూడా మా పట్టాలు మాకు ఎప్పుడు ఇస్తామని ముక్కు పిండి మా దగ్గర డబ్బులు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఈ సొసైటీలో రైతుల వద్ద నుండి లారీ వాళ్లకు బస్తా కు మూడు రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు మరోపక్క అమాలీలు వేస్తే మాకు బాగా ఎండ కొడుతుంది వడ్లు పెట్టాలి అని వాళ్లకు ఇష్టం వచ్చిన వడ్ల డబ్బాలను ఎత్తుకొని వెళ్తున్నారు అని రైతుల ఆవేదన.
ఏది ఏమైనప్పటికీ మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడనే లారీలను హమాలీలను రైతు సొసైటీ సిబ్బందిని నిలదీస్తామని హెచ్చరించారు. గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఎస్కే అక్బర్ అతడు మొట్టమొదట అతని సీరియల్ 95వ నెంబరు వచ్చినప్పటికీ నా పక్కన ఉన్న 200 కుప్పలు చాలామంది రైతులై ధాన్యం కాంటాలు వేశారు కానీ నన్ను మరిచారు.
నేను ఏమి అన్యాయం చేశానని నిర్వాహకులను హమాలీలనుఅడగడంతో నీతో మాకు సంబంధం లేదు అని అమాలీలు ఆ రైతుతో గొడవ పెట్టుకుని రైతుని కొట్టడం జరిగింది .ఇంత జరిగిన ఇక్కడ ధాన్యం నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అ సలు నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వారికి ఎవరు డబ్బులు ఇస్తే వారి ధాన్యం కాం టా లు బస్తాలు ఎగుమతి చేస్తున్నారని మిగత రైతులను పక్కన పెట్టడంతో ఇన్ని రోజులు పట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మాకు న్యాయం చేయాలని మండల అధికారులను జిల్లా అధికారులను గొట్టిపర్తి గ్రామ రైతులు కోరుతున్నారు.
By : Subhash , Thungathurthy









