Miryalaguda : మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోరం.. ముగ్గురు సజీవ దహనం.. ఉలిక్కిపడిన మిర్యాలగూడ..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో చోటుచేసుకుంది.

Miryalaguda : మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోరం.. ముగ్గురు సజీవ దహనం.. ఉలిక్కిపడిన మిర్యాలగూడ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు అమ్మమ్మ, మనవడు, మనవరాలు సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో చోటుచేసుకుంది. ఈ ఘోర సంఘటనకు ఒక్కసారిగా మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది.
కలాల్ వాడకు చెందిన చంద్రమ్మ (50) తన మనవడు లక్ష్మణ్ (17) ప్రణతి (14) తో ఇంట్లో నిద్రిస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకోవడంతో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. పొగ, మంటలకు ఊపిరాడక నిద్ర లోనే ప్రాణాలు వదిలారు.
కలాల్ వాడకు చెందిన చంద్రమ్మ , సైదులు భార్యాభర్తలు. కాగా సైదులు అనారోగ్యంతో నెల రోజుల క్రితం చనిపోయాడు. చంద్రమ్మ పెద్ద కూతురు ధనమ్మ భర్త పదేళ్ల క్రితం చనిపోగా ధనమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది.
మూడు రోజుల క్రితం ధనమ్మ ఇళ్లల్లో పనిచేసేందుకు పూనే వెళ్ళింది. కాగా గురువారం రాత్రి చంద్రమ్మ తన మనవడు, మనవరాలు తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ కు అంటుకోగా మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పంచనామా నిర్వహించారు.









