Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

అర్వపల్లి , మన సాక్షి ;

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నీటి మూటలుగానే మిగిలిపోయింది. యాసంగిలో భారీ వర్షాలకు పంటలు అతలాకుతులైన రైతులను ఆదుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అది ఇప్పటికీ నెరవేరలేదు. వానకాలం సీజన్ వచ్చినప్పటికీ కూడా యాసంగి సీజన్ లో నష్టపోయిన రైతులను ఇప్పటివరకు ఆదుకోలేదు. అందుకు రైతులు ఎదురుచూస్తున్నారు.

 

పంటల నష్టం వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులను కూడా ఆదేశించారు. దాంతో వ్యవసాయ అధికారులు గ్రామాలలో పర్యటించి పంటల నష్టం అంచనా వేశారు. పూర్తిస్థాయి నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు.

 

యాసంగి సీజన్లో రైతులు సాగుచేసిన వరి పంట మార్చి నెలలో వచ్చిన వడగండ్ల వానకు పూర్తిగా నేలమట్టమయింది . సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం లోని అర్వపల్లి రామన్నగూడెం వేల్పుచర్ల అడేవంల కుంచమర్తి జాజిరెడ్డిగూడెం పర్సపెల్లి బొల్లంపల్లి గ్రామాలలో 5500 ఎకరాల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు నివేదిక పంపించారు.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వడగండ్ల వాన వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10000 రూపాయలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సంతోషపడ్డారు. మార్చి మొదటి వారంలో నష్టపోయిన రైతులకు మాత్రమే నష్టపరి హారం వచ్చిందని మార్చి రెండవ వారం ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

 

ALSO READ :

  1. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
  2. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
  3. Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!
  4. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

 

 

పంట చేతికి రాకపోవడం వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో తమ ఖాతాలో ఎప్పుడైనా పడతాయని రైతులు ఎదురుచూస్తున్నారు అధికారులు స్పందించి పంట నష్టం వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నారు