Hyderabad : పార్కు కబ్జాపై చర్యలు తీసుకోవాలి..!
హైదరాబాదులోని శేరిలింగంపల్లి, మియాపూర్‌లకు కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లకు 'జనం కోసం' సంస్థ ఫిర్యాదు చేసింది.

Hyderabad : పార్కు కబ్జాపై చర్యలు తీసుకోవాలి..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
హైదరాబాదులోని శేరిలింగంపల్లి, మియాపూర్‌లకు కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లకు ‘జనం కోసం’ సంస్థ ఫిర్యాదు చేసింది. సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్‌లు ఈ మేరకు జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ తోపాటు ఇతర అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
సందర్బంగా వారు మాట్లాడుతూ కాలనీలో తాము కాలనీ అసోసియేషన్ అధ్యక్షులమని స్వయంగా ప్రకటించుకుని, అసోసియేషన్ పేరుతో కొందరు వ్యక్తులు పార్కు స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమాలను అరికట్టాలని అధికారులను కోరారు.
అంతేకాకుండా కాలనీలో, పార్కు పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారుల నుంచి, పార్కు చుట్టూ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయించి అసోసియేషన్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా దర్యాప్తు జరపాలని ‘జనం కోసం’ డిమాండ్ చేసింది. ప్రజా స్థలాల పరిరక్షణ కోసం అధికారులు తక్షణమే స్పందించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.









