Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. చిగురిస్తున్న రైతుల ఆశలు..!
కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎగువన ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. చిగురిస్తున్న రైతుల ఆశలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎగువన ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయాన్ని వరద నీరు తాకింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రైతుల ఆశలు చిగురించాయి.
ఆగస్టులో సాగర్ జలాశయం కూడా నిండుతుందని ఆశలు పెట్టుకున్నారు.
కర్ణాటక నుంచి కృష్ణనదిలో 50వేల కుసేక్కుల వరద నీరు వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి 80వేల కుసేక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపురం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల జలాశయం విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37వేల 967 కి కుసేక్కుల నీరు కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి భారీగా వరద వస్తుంది. కృష్ణ, బీమా నదుల ప్రవాహాలను కలిపి జూరాలకు లక్ష కుసేక్కుల వరద వస్తుండగా పై నుంచి వచ్చే వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుకోనున్నది.









