Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు
Cafe : కేఫ్‌ల గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు..!
కొత్తపల్లి శివారులోని పలు విద్యాసంస్థల వంద మీటర్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కేఫ్‌లపై కొత్తపల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

Cafe : కేఫ్‌ల గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు..!
కరీంనగర్, మనసాక్షి :
కొత్తపల్లి శివారులోని పలు విద్యాసంస్థల వంద మీటర్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కేఫ్‌లపై కొత్తపల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రెండు కేఫ్‌ల నిర్వాహకులు చట్టవిరుద్ధంగా సిగరెట్లు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆయా కేఫ్‌ల నుంచి సుమారు 15 వేల రూపాయల విలువైన సిగరెట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న సదరు కేఫ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కొత్తపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (సీఐ) బిల్లా కోటేశ్వర్ తెలిపారు. విద్యాసంస్థల పరిసరాల్లో ఇలాంటి అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో ఎస్సై సాంబమూర్తితో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.









