Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
వ్యవసాయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. అవి సాగు చేస్తే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, ఆదాయం..! 

వర్షాభావ పరిస్థితులు మరియు ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది సాగునీటి కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి రైతులు సాంప్రదాయ వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. అవి సాగు చేస్తే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, ఆదాయం..! 

సూర్యాపేట, నడిగూడెం, మనసాక్షి :

వర్షాభావ పరిస్థితులు మరియు ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది సాగునీటి కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి రైతులు సాంప్రదాయ వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.

నడిగూడెంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఆయన గ్రామానికి చెందిన రైతులు దున్న రవి, రమణ తమ పొలాల్లో సాగు చేసిన సొరకాయ, బీరకాయ, కీర దోసకాయ తోటలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధిస్తున్న రైతు నైపుణ్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

​వరి సాగుకు నీటి వినియోగం ఎక్కువ
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక ఎకరం వరి సాగుకు ఏకంగా 45 నుంచి 55 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని, అదే పత్తికి 25 లక్షల లీటర్లు, ఇతర ఆరుతడి పంటలకు ఇంకా తక్కువ నీరు సరిపోతుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగర్ కాలువల ద్వారా సాగునీరు రావడం కష్టమని, ఉన్న అరకొర నీటితో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేశారు.

​కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం రైతులకు నిలకడైన ఆదాయం అందించేందుకు కూరగాయల సాగు, ఆయిల్ పామ్ తోటలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ, మండల ప్రత్యేక అధికారి దామోదర్ రెడ్డి తహసిల్దార్ మంగ, ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎడిఎ జ్ఞానేశ్వరి, ప్రశాంతి, ఎంఏవో మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు