Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : స్త్రీ నిధి స్కామ్.. జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వీఓఏల తొలగింపు..!

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తుంగతుర్తి మండల పరిధిలోని గానుగ మండ గ్రామంలో వివోఏ తొలగింపు .. ఆఫీస్ బేరర్లపైనా భర్తరఫ్ డీపీఎం బెనర్జీ పై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ ఆదేశం.

District Collector : స్త్రీ నిధి స్కామ్.. జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వీఓఏల తొలగింపు..!

సూర్యాపేట, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తుంగతుర్తి మండల పరిధిలోని గానుగ మండ గ్రామంలో వివోఏ తొలగింపు .. ఆఫీస్ బేరర్లపైనా భర్తరఫ్ డీపీఎం బెనర్జీ పై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులకు అండగా ఉండాల్సిన స్త్రీ నిధి నిధులు పక్కదారి పట్టాయి. సభ్యులు కష్టపడి కట్టిన వాయిదా డబ్బులను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ తన సొంతానికి వాడుకున్నాడు.

ఈ భారీ అవకతవకలు కలెక్టర్ గ్రీవెన్స్ విచారణలో బయటపడటంతో నిందితుడైన వీఓఏపై వేటు పడింది. తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ సమాఖ్యలో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. గానుగబండ గ్రామ సమాఖ్యలో 2022లో స్త్రీ నిధి రుణాలు మంజూరయ్యాయి.

సభ్యులు తమ నెలవారీ వాయిదాలను క్రమం తప్పకుండా వీఓఏ సైదులుకు చెల్లిస్తున్నారు. అయితే, సైదులు ఆ డబ్బును పూర్తిగా స్త్రీ నిధి ఖాతాలో జమ చేయకుండా సొంతనికి వాడుకున్నారు. సభ్యుల నుంచి ముందస్తు వాయిదాల పేరుతో భారీగా వసూలు చేసి, బ్యాంకు రికార్డుల్లో మాత్రం కనీస మొత్తమే చెల్లిస్తూ మిగతా సొమ్మును స్వాహా చేశాడు. నిబంధనల ప్రకారం వీఓఏలు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదని రూల్ ఉన్నప్పటికీ, ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

ఈ అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ శివప్రసాద్ ఈ ఏడాది మార్చిలో ఎంక్వయిరీ చేశారు. ఈ విచారణలో వీఓఏ సైదులు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, అతను స్వాహా చేసిన రూ. 14,54,000 తిరిగి స్త్రీ నిధి ఖాతాలో రీపేమెంట్ చేయించారు. కేవలం వీఓఏ మాత్రమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఆక్రమలలో సహకరించినట్లు విచారణలో తేలింది.

వీఓఏ నిధులు దారి మళ్లిస్తున్నా పట్టించుకోకపోవడం, విచారణ సమయంలో సరిగ్గా స్పందించకపోవడంతో వారిపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వీఓఏ సైదులును తక్షణమే విధుల నుంచి తొలగించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆఫీస్ బేరర్లను కూడా ఆ పదవుల నుంచి తీసేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డిఆర్డిఓ పిడి సన్యాసయ్య ను చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.

మరిన్ని వార్తలు