Miryalaguda : ఎస్పిఆర్ స్కూల్ విద్యార్థులు వృద్ధాశ్రమ సందర్శన
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ పి ఆర్ అరోరా బ్రాంచ్ పాఠశాల విద్యార్థులు శనివారం అవంతీపురంలోని వృద్ధాశ్రమం సందర్శించారు.

Miryalaguda : ఎస్పిఆర్ స్కూల్ విద్యార్థులు వృద్ధాశ్రమ సందర్శన
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ పి ఆర్ అరోరా బ్రాంచ్ పాఠశాల విద్యార్థులు శనివారం అవంతీపురంలోని వృద్ధాశ్రమం సందర్శించారు. పాఠశాల డైరెక్టర్స్ నాదెండ్ల అయ్యన్న, యామిని వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ బి. జనార్ధన్ రెడ్డి , బి. కరుణ సమీపంలో ఉన్న అవంతీపురంలోని వృద్ధాశ్రమానికి పాఠశాల విద్యార్థులను తీసుకొని వెళ్ళారు.
ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు, మిఠాయిలు, బెడ్ షీట్లు పంపిణీ చేశారు. దీనిద్వారా విద్యార్థులు ఆశ్రమంలో ఉన్న వృద్ధుల యొక్క ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా ఉంటూ వృద్ధులు అనుభవించే మానసిక వేదన, శారీరక ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఈ వృద్ధాశ్రమ సందర్శన ద్వారా విద్యార్థులకు నేటితరం పిల్లలు తల్లిదండ్రులను, నానమ్మ, తాతయ్యలను ఆశ్రమాల్లో ఉంచుతున్నారు. కుటుంబంలో పెద్దలు ఉంటే పిల్లలకు కలిగే భరోసా, పెద్దల అనుభవాలు, వారునేర్పే మంచిమాటలు నేటి తరానికి ఎంతో అవసరమని నేర్చుకున్నారు.
విద్యార్ధుల ఆత్మీయ పలకరింపు, వారు ప్రేమతో ఇచ్చిన పండ్లు, వస్తువులు తీసుకుని వృద్ధులంతా చాలా అనందించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు, కె. శ్రీనివాస్ రెడ్డి, డి. మోహన్ రెడ్డి, టి. అనంత రెడ్డి, పాఠశాల బృందాన్ని అభినందించారు, కృతజ్ఞతలు తెలియజేసారు.










