నల్గొండ అభివృద్ధికి ఆర్ధిక బలం.. రూ.197.44 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్..!
నల్లగొండ నగర అభివృద్ధికి భారీ ఆర్థిక బలం చేకూరింది. పట్టణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టనున్న నల్లగొండ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్రాజెక్టుకు రూ.197.44 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది.

నల్గొండ అభివృద్ధికి ఆర్ధిక బలం.. రూ.197.44 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్..!
–ప్రపంచ బ్యాంకు సహకారంతో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి
–70 శాతం ప్రపంచ బ్యాంకు వా టా, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ ని ధులు
నల్లగొండ, మన సాక్షి :
నల్లగొండ నగర అభివృద్ధికి భారీ ఆర్థిక బలం చేకూరింది. పట్టణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టనున్న నల్లగొండ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్రాజెక్టుకు రూ.197.44 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో తెలంగాణ అర్బన్ ట్రా న్స్ఫార్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రా మ్ (TUTJP) కింద ఈ ప్రాజెక్టు ను అమలు చేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని తెలంగాణ యూసీఎఫ్ స్టేట్ మి షన్ డైరెక్టర్ టి.కె. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.138.21 కోట్లు ప్రపంచ బ్యాంకు వాటా
మొత్తం రూ.197.44 కోట్ల ప్రాజె క్టు వ్యయంలో 70 శాతం నిధు లు అంటే రూ.138.21 కోట్లు ప్ర పంచ బ్యాంకు ద్వారా సమకూర నున్నాయి. మిగిలిన 30 శాతం వాటాగా రూ.59.23 కోట్లను తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిం చనుంది. ఈ నిధులతో నల్లగొండ పట్టణంలో ఆమోదించిన ప్రాజెక్టు పరిధి మేరకు మౌలిక సదుపా యాల అభివృద్ధి పనులు చేపట్ట నున్నారు.
నిబంధనలకు అనుగుణంగా పనులు
ఆమోదించిన డీపీఆర్‌లు, సాం కే తిక ప్రమాణాలు, పనుల పరిధి, అమలు గడువులకు అనుగుణం గా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పను లు ప్రారంభించే ముందు సంబం ధిత ఇంజనీరింగ్ విభాగాల నుంచి సాంకేతిక అనుమతులు పొందాలని, పర్యావరణ, సామాజిక భద్రతా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
Also Read : షర్మిల సంచలన స్వీట్.. యలహంక ప్యాలెస్, కుమార్తె వివాహం పై ఎమన్నారంటే..!
అలాగే పనుల నాణ్యత, ఆర్థిక నిర్వహణ, నిధు ల వినియోగం, భౌతిక పురోగతి పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చే పట్టాలని మున్సిపల్ కమిషనర్, సంబంధిత అమలు సంస్థలకు సూచించింది. అనుమతి పొంది న ప్రాజెక్టు వ్యయానికి మించి ఖ ర్చు చేయరాదని, పనుల పరిధి లో మార్పులు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నగర రూపురేఖల్లో మార్పులకు అవకాశం
ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆర్థిక సహకారంతో చే పట్టనున్న ఈ ప్రాజెక్టు నల్లగొండ పట్టణ అభివృద్ధికి కీలకంగా మా రనుంది. ప్రాజెక్టు కింద ఆమోదిం చిన పనులు పూర్తిస్థాయిలో అ మలైతే పట్టణ మౌలిక సదుపా యాలు బలోపేతం కావడంతో పాటు పౌర సేవల మెరుగుదలకు అవకాశం కలగనుంది.
Also Read : రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం.. పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన దుండగుడు
మంజూరైన నిధులను సక్రమంగా విని యోగిస్తూ, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబం ధిత అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా ప్రధాన గణాం కాల ప్రకారం మొత్తం ప్రాజెక్టుకు రూ.197.44 కో lట్లు కాగా ప్రపం చ బ్యాంకు వాటా 70 శాతంగా రూ.138.21 కోట్లు, రాష్ట్ర ప్రభు త్వ వాటా 30 శాతంతో రూ.59 .23 కోట్లుగా స్పష్ఠీకరించారు.








