Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
Narayanpet : అథ్లెటిక్స్ లో పేటకు పతకాల పంట..!
హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్, జూనియర్ ఉస్మానియా అథ్లెట్స్ మీట్ లో నారాయణపేట క్రీడాకారులు అసమాన ప్రతిభ చూపించి గోల్డు, సిల్వర్, బ్రౌన్ పథకాలను సాధించారు.

Narayanpet : అథ్లెటిక్స్ లో పేటకు పతకాల పంట..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్, జూనియర్ ఉస్మానియా అథ్లెట్స్ మీట్ లో నారాయణపేట క్రీడాకారులు అసమాన ప్రతిభ చూపించి గోల్డు, సిల్వర్, బ్రౌన్ పథకాలను సాధించారు. మెన్స్ విభాగం హార్డిల్స్ లో జనార్ధన్ గోల్డ్ మెడల్ సాధించారని, అండర్ 16 లో పూజ సిల్వర్ మెడల్, బాలరాజు 4వందల హార్డిల్స్ లో బ్రౌన్ పథకాలను సాధించారనీ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ తెలిపారు. పథకాలు సాధించిన అథ్లెట్లను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్ సారంగ పాణి,శరద్ కుమార్, వెంకటే శ్వర రెడ్డి, కోచ్ లు జగదీష్, హారికదేవి,మహేష్
తదిత రులు అభినందించారు.









