TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు వివిధ రకాల ప్యాకేజీలను ప్రకటిస్తుంది. సిటీ బస్ పాసులతో పాటు పల్లె వెలుగు బస్ పాస్ లను కూడా తీసుకువచ్చింది. అంతేకాకుండా ప్రయాణికులకు 10% తగ్గింపు టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

శ్రీశైలం భక్తులు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాదు నుంచి ప్రతిరోజు శ్రీశైలం కు తెలంగాణ ఆర్టీసీ 40 బస్సులను నడుపుతుంది. ప్రతి వీకెండ్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?

2. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

 

 

తెలంగాణ ఆర్టీసీ.. పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు టూర్ ప్యాకేజీలను సైతం ప్రకటించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. జూలై 22వ తేదీ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానున్నది.

 

ప్రతి శనివారం సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి బస్సులను శ్రీశైలం నడపాలని నిర్ణయించింది. ప్రతి శనివారం హైదరాబాదులోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీశైలం కు చేరుకుంటుంది.

 

ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం పూర్తయ్యాక 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణా నదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని దర్శనానికి భక్తులను తీసుకెళ్తారు. శీఘ్రదర్శన సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రాత్రి భోజనం శ్రీశైలంలోని హోటల్లో బస ఉంటుంది.

 

మరుసటి రోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు భక్తులకు ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం బ్రేక్ ఫాస్ట్ పూర్తవగానే అక్కడ నుంచి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాక్షి గణపతి ఆలయ దర్శనం, పాలధార, పంచదార, శిఖరం, శ్రీశైలం డ్యాం ప్రాంతాలకు తీసుకెళ్తారు. మార్గమధ్యలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7:30 గంటలకు ఎంజీబీఎస్ కు 8:30 గంటలకు జేబీఎస్ కు బస్సు చేరుతుంది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

3. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

4. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

 

 

తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలం ప్రత్యేక టూర్ ప్యాకేజీ లో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి, సాక్షి గణపతి, పాతాళ గంగ, పాలధార , పంచదార, శిఖరం, శ్రీశైలం డ్యాం తదితర ప్రాంతాలు సందర్శించవచ్చును. ఈ ప్యాకేజీలో పెద్దలకు 2700 రూపాయలు, పిల్లలకు 1570 రూపాయలు ఖరారు చేశారు. ఈ ప్యాకేజీలో రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుము ప్యాకేజీ లోనే ఉంటుంది. ఆహారం, ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులు ప్రయాణికుల భరించాల్సి ఉంటుంది.

 

భక్తులంతా ఈ ప్యాకేజీని వినియోగించుకోవడానికి టి ఎస్ ఆర్ టి సి వెబ్ సైట్ tsrtconline.in వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను కాల్ సెంటర్ నెంబర్లు 040 – 694400 00, 040 – 23450033 సంప్రదించాలని టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ,ఎండి వీసి సజ్జనార్ తెలిపారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. 

1. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

2. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!