PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

అతి పెద్ద యుపిఐ (UPI) ప్లాట్ ఫామ్ ఫోన్ పే తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫోన్ పే లో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల ఫోన్ పే ఇన్సూరెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

అంతేకాకుండా ఇన్సూరెన్స్ కోసం ఫోన్ పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నెలవారి పేమెంట్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. 5 లక్షల రూపాయల మొత్తానికి హెల్త్ పాలసీ తీసుకుంటే నెలవారి గా 950 రూపాయలు చెల్లించవచ్చును. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. కేర్ హెల్త్ ప్లాన్ తీసుకుంటే ఈ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

 

 

ఇన్సూరెన్స్ సేవలను కొత్తగా ప్రవేశపెట్టి పేటియం, రాజోర్ పే, ఫైల్ ల్యాబ్స్ లాంటి యూపీఐ సంస్థలకు ఫోన్ పే ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దాంతోపాటు ఫోన్ పే పి ఓ ఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) డివైజ్ కూడా లాంచ్ చేసింది . దీనివల్ల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా మర్చంట్ లు పేమెంట్లు స్వీకరించవచ్చును.

 

ALSO READ : 

1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

2. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

3. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

4. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

5. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

దేశవ్యాప్తంగా ఫోన్ పే కు 3.5 కోట్లపైగా మర్చంట్ భాగస్వాములు ఉన్నారు. వచ్చేయడానికల్లా దేశవ్యాప్తంగా 1.5 లక్షల డివైజ్ లను అందుబాటులోకి తీసుకురావడమే ఫోన్ పే లక్ష్యంగా ముందుకు వెళుతుంది.

 

హెల్త్ ఇన్సూరెన్స్ విషయంపై ఫోన్ పే ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గాలా మాట్లాడుతూ.. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు నెలవారి చెల్లింపుల ద్వారా సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఫోన్ పే ఇన్సూరెన్స్ ప్లాట్ ఫామ్ ద్వారా 56 లక్షల పాలసీలను విక్రయించింది. దేశవ్యాప్తంగా 98% పిన్ కోడ్స్ కు సేవలు అందుబాటులో ఉంచింది.

 

కోటి రూపాయల వరకు కవరేజ్ తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. పరిమితులు లేకుండా హాస్పిటల్ రూమ్ పొందవచ్చును. బోనస్ కవర్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రీ పోస్ట్ సేల్స్ అసిస్టెంట్స్ కూడా ఉంది.

ఇన్సూరెన్స్ ఇలా కొనుగోలు చేయాలి:

ఫోన్ పే ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని భావించేవారు యాప్ లోకి వెళ్ళాలి. ఇన్సూరెన్స్ సెక్షన్లోకి వెళ్లాలి. ఆ తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోడ్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చును. తర్వాత వివరాలు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. నెలవారిగా లేదంటే వార్షికంగా డబ్బులు చెల్లించవచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది.

 

ALSO READ : 

1. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

2. గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు

3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

4. Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ ..!

5. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!