మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

మిర్యాలగూడ, మనసాక్షి:

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులు మెట్టనార్లు చల్లుకున్నారు. బోర్లు, బావుల కింద ఉన్న రైతులు ముందస్తుగానే నార్లు పోసుకొని వానకాలం సాగుకు సిద్ధమయ్యారు. కాగా ఏ ఆధారం లేని రైతులు సాగునీరు ఎప్పుడొస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు.

 

నాగార్జునసాగర్ జలాశయం ద్వారా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని సుమారుగా 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాంతోపాటు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం నీటి కోసం ఎదురుచూస్తున్నారు.

 

వెలవెలబోతున్న సాగర్ :

 

జూలై మాసం సగం రోజులు గడిచినప్పటికీ కృష్ణానదిలో ఎలాంటి వరదలు రాకపోవడం వల్ల నాగార్జునసాగర్ జలాశయం వెలవెలబోతుంది. పైనుంచి కూడా ఎలాంటి ప్రవాహం లేకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు సాగునీటితో పాటు తాగునీటి కష్టాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.

 

నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేదు. దాంతో ఎగువ భాగంలో ఉన్న శ్రీశైలం, జూరాల, నారాయణపూర్, ఆలమట్టి ప్రాజెక్టుల్లో కూడా నీటిమట్టం పెరగలేదు. దాంతో నాగార్జునసాగర్ కు ఎలాంటి ఇన్ ఫ్లో లేకపోవడంతో నీటిమట్టం తగ్గిపోయింది.

 

ALSO READ : 

 

1. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

3. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

4. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

5. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

 

 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద తెలుగు రాష్ట్రాల్లో 23 లక్షల ఎకరాలు సాగు అవుతుంది . జంట నగరాల తాగునీటి అవసరాలకు 1350 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 517.5 అడుగుల కు చేరింది. గత ఏడాది జూలై మాసంలో వర్షాలు కురవడంతో భారీగానే వరదలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షాలు రాలేదు. దాంతో డ్యాం వెలవెలబోతుంది.

 

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని సాగర్ జలాశయం లోకి ఇన్ ఫ్లో ప్రారంభమయ్యాకనే అధికారులు స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇటీవల కొంతమేర నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేశారు. కొత్తగా జలాశయంలోకి నీరు చేరితేనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో వర్షాలు పడి నీరు చేరుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

 

ALSO READ : 

1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

2. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

3. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు