Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంవ్యవసాయం

Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ఒక్కపంటతోటే రైతు కోటీశ్వరుడు అయ్యాడు. నెలరోజుల కాలంలో 1.50 కోట్ల రూపాయలు సంపాదించాడు. మరో 15 రోజుల్లో మరో 50 లక్షల రూపాయలు రావచ్చని అంచనా వేస్తున్నారు.

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా.. టమాటా.. అంటే బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా మారిపోయింది. టమాటా పంటను పండించేవారు పొలాల్లో రాత్రి పగలు కూడా కాపలా ఉండాల్సి వస్తుంది. కొన్నిచోట్ల టమాటా పంటను దొంగిలించి తీసుకుపోయిన సంఘటనలు సైతం ఉన్నాయి.

 

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో డిమాండ్ ను బట్టి కిలో టమాటా 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పలుకుతుంది. ఈ క్రమంలో టమాటా పండించిన రైతులు లాభపడ్డారు. ఇన్నాళ్లు టమాటాకు కనీస ధర లభించక రోడ్లపై పారబోసిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఇప్పుడు టమాటా పంట రైతులను రాత్రికి రాత్రే కోటీశ్వరులు చేస్తుంది.

 

ALSO READ : 

 

1. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

2. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

3. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

4. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!

 

 

మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన తుకారాం భగోజి కుటుంబం 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తుంది. ఐదు ఏళ్ళుగా టమాటా పంటను పండిస్తున్నారు. అయినా నష్టాలే వస్తున్నాయి. ఈ ఏడాది మాత్రం 12 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు. నెలరోజులుగా పంట చేతికి వస్తూ.. ఉంది.

 

12 ఎకరాల్లో 13 వేల బాక్సుల టమాట దిగుమతి వచ్చింది. ఒక్కో బాక్స్ లో 20 కిలోల టమాటా ఉంటుంది. మొత్తంగా 13 వేల బాక్సుల టమాటాను విడతల వారీగా విక్రయించి తుకారం ఫ్యామిలీ కోటీశ్వరులు అయ్యారు.

 

తుకారాం కోడలు సోనాలి ఆధ్వర్యంలో నారాయణ్ గంజ్ మార్కెట్లో వీటిని విక్రయించారు. టమాటా నాణ్యత ఆధారంగా కిలో టమాట 80 రూపాయల నుంచి 125 రూపాయల వరకు మార్కెట్లో విక్రయించారు. జూలై 14 వ తేదీ 900 బాక్సుల టమాటా విక్రయించగా 18 లక్షల రూపాయలు వచ్చింది. అదేవిధంగా 2500 బాక్సులను 100 రూపాయల చొప్పున విక్రయించారు. మరో 6000 బాక్సులను 80 రూపాయల చొప్పున ఇలా నెలరోజుల వ్యవధిలో 13వేల బాక్స్ లను విక్రయించి ఒక కోటి 50 లక్షల రూపాయలను సంపాదించుకున్నారు.

 

ఆ కుటుంబానికి 20 ఏళ్ల నాటి దరిద్రం ఒక్క ఏడాదితో పోయింది. ఈసారి పంట బాగా దిగుబడి రావటంతో పాటు ధర కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పటివరకు కోటి యాభై లక్షల రూపాయలు వచ్చాయని, మరో పదిహేను రోజుల్లో మరో 50 లక్షల రూపాయలు రావచ్చని అంచనా వేస్తున్నట్లు తుకారం కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు