Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణహైదరాబాద్

GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

 

మనసాక్షి , వెబ్ డెస్క్:

దిగ్గజ యూపీఐ పేమెంట్ యాప్ గూగుల్ పే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. గతంలో మాదిరిగా క్యాష్ బ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. గూగుల్ పే వినియోగదారులను.. ఆకట్టుకునేందుకు కొత్త యూజర్లను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

 

అందుకే ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీగా క్యాష్ బ్యాక్ తాజాగా ప్రకటించింది. గూగుల్ పే వాడే వారికి ఏకంగా 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పటికే చాలామంది గూగుల్ పే యూజర్లకు క్యాష్ బ్యాక్ వస్తున్నాయి.

 

 

గతంలో గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపినందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించేది. నగదు లావాదేవీలను బట్టి క్యాష్ బ్యాక్ తప్పనిసరిగా వచ్చేది. కొంతమందికి ఎక్కువ మొత్తంలో… మరి కొంతమందికి తక్కువ మొత్తంలో డబ్బులు తిరిగి వచ్చేవి. కానీ ఆ తర్వాత క్యాష్ బ్యాక్ ఆఫర్ ను గూగుల్ పే నిలిపివేసింది.

 

ఓచర్ల రూపంలో ఆఫర్లు అందిస్తుంది. ఓచర్లు వచ్చినవారు వాటికి సంబంధించిన వి కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తుంది. కానీ ఇప్పుడు మళ్లీ గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఆఫర్ ను నగదు రూపంలో తీసుకొచ్చింది. 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎక్కువ లావాదేవీలు జరిపిన వారికి ఎక్కువ… తక్కువ లావాదేవీలు జరిపిన వారికి తక్కువ.. క్యాష్ బ్యాక్ అందిస్తుంది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

2. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

3. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!

4. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

 

గతంలో లక్ష రూపాయలు వరకు లావాదేవీలు చేసిన వారికి 50 వేల రూపాయలు, లక్ష రూపాయలు కూడా క్యాష్ బ్యాక్ వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కొంతమందికి క్యాష్ బ్యాక్ రాకుండా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని కూడా వచ్చేది. కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కొద్ది రోజుల క్రితమే గూగుల్ పే నిలిపివేసింది. తిరిగి మళ్లీ ఈ ఆఫర్ ను తీసుకువచ్చింది. దాంతో యూజర్లు తిరిగి గూగుల్ పే వాడకాన్ని పెంచినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు