Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

మనసాక్షి : వెబ్ డెస్క్:

ఫ్లిప్ కార్ట్ (Flipkart) నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఆ కంపెనీ సహకారంతో 10 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఫ్లిప్ కార్ట్ డెలివరీ ఫ్రాంచైజీ పేరుతో కంపెనీలో డెలివరీ పార్టనర్ అయ్యే అవకాశం సామాన్యులకు అందిస్తుంది.

 

ఈ కంపెనీలో ప్రాంచైజీగా మారిన వారు… వారి ప్రాంతాలలో కస్టమర్లకు ఆర్డర్లను సకాలంలో డెలివరీ చేసే బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇండియాలో ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వారికి ఫ్లిప్ కార్డ్ కేరాఫ్ గా మారింది.

 

ఈ కంపెనీ దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలలో డెలివరీ చేస్తుంది. లక్షల సంఖ్యలలో ఉన్న ప్రొడక్ట్స్ ను డెలివరీ చేయటం ఫ్లిప్ కార్ట్ కు  ప్రతినిత్యం సవాల్ గా మారుతుంది. అందువల్ల ఆర్డర్లను డెలివరీ చేయడానికి ఇతర వ్యక్తుల నుంచి సహాయం తీసుకుంటుంది. ఫ్లిప్ కార్డ్ డెలివరీ ప్రాంచైజీ పేరుతో కంపెనీలో డెలివరీ పార్ట్నర్ అయ్యే అవకాశాన్ని నిరుద్యోగులకు కల్పిస్తుంది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

 

1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

3. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

4. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

5. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

 

ఫ్లిప్ కార్ట్ డెలివరీ ప్రాంచెజీ తీసుకుంటే చిన్న వ్యాపారంగా ప్రారంభించే అవకాశం ఉంది. తీసుకోవడానికి సొంత ఫోర్ వీలర్ కలిగి ఉండాలి. ఆ వాహనానికి వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. 18 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. తప్పనిసరిగా 500 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. వాటితో పాటు ఫ్లిప్ కార్డ్ ఫీజు చిన్న ప్రాంతానికి ఒక లక్ష రూపాయలు, పెద్ద ప్రాంతానికి ఐదు లక్షల రూపాయలు ఉంటుంది.

 

ఫ్లిప్ కార్ట్ డెలివరీ ప్రాంచైజీ తీసుకున్న తర్వాత డెలివరీ ప్లాట్ ఫామ్ ఎలా ఉపయోగించాలి. వినియోగదారులకు ఆర్డర్లను సకాలంలో ఎలా డెలివరీ చేయాలనే అంశాలపై శిక్షణ కూడా ఇస్తారు. ఏవైనా సమస్యలు వస్తే ఫ్లిప్ కార్డ్ వినియోగదారుల సపోర్టు టీంకు కూడా యాక్సెస్ ఉంటుంది.

 

డెలివరీ చేసే ఆర్డర్ల సంఖ్య నిర్వహణ ఖర్చుల ఆధారంగా ఈ వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫ్లిప్ కార్డ్ తరపున ప్యాకేజీలను డెలివరీ చేసినప్పుడు ప్రతి డెలివరీకి కంపెనీ కమిషన్ రూపంలో కొంత డబ్బు చెల్లిస్తుంది. కమిషన్ మొత్తం అనేది ప్యాకేజీ ఎక్కడ డెలివరీ చేయాలి, ప్యాకేజీ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి. అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

 

కమిషన్ల రూపంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. సుమారుగా నెలకు 40,000 నుంచి 80 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఫ్లిప్ కార్ట్ డెలివరీ పార్ట్నర్ సగటు కమిషన్ రేటు ఐదు శాతం ఉంటుంది. ఆ రేటుతో సంవత్సరానికి 10 వేల ఆర్డర్లను డెలివరీ చేయగలిగితే 5 లక్షల రూపాయల కమిషన్ పొందవచ్చు.