Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

రాజ్యాంగ హక్కులను గౌరవించాలి.. ఎంపీడీవో సుభాష్ చంద్రగౌడ్..!

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ దేశాభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఎంపీడీవో సుభాష్ చంద్రగౌడ్ పిలుపునిచ్చారు.

రాజ్యాంగ హక్కులను గౌరవించాలి.. ఎంపీడీవో సుభాష్ చంద్రగౌడ్..!

కంగ్టి, మన సాక్షి : భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ దేశాభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఎంపీడీవో సుభాష్ చంద్రగౌడ్ పిలుపునిచ్చారు. 77వ భారత రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో

అధికారులు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ… ప్రతి పౌరుడు రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక సూత్రాలను పాటిస్తూ దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. దేశమే మొదటి ప్రాధాన్యత (నేషన్ ఫస్ట్) అనే భావనతో ప్రతి ఒక్కరూ దేశం పట్ల దేశభక్తిని, రాజ్యాంగం పట్ల విశ్వసనీయతను కలిగి ఉండాలని ఎంపిడిఓ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ లక్ష్మణ్, ఏపీఓ బస్వరాజ్, పంచాయతీ కార్యదర్శులు ,మండల సిబ్బంది ఉన్నారు.

By : JALEEL, KANGTI

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు