Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయంహైదరాబాద్

ప్రజలే కుటుంబం.. ప్రజా సేవే ధ్యేయం.. ఎమ్మెల్యే బండారి మూడేళ్ల ప్రజా ప్రస్థానంపై ప్రత్యేక పుస్తక ఆవిష్కరణ..!

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రజా ప్రస్థానం, ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాన్ని జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆవిష్కరించారు.

ప్రజలే కుటుంబం.. ప్రజా సేవే ధ్యేయం.. ఎమ్మెల్యే బండారి మూడేళ్ల ప్రజా ప్రస్థానంపై ప్రత్యేక పుస్తక ఆవిష్కరణ..!

– పుస్తకాన్ని రచించిన ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆలేటి రమేష్

ఉప్పల్, మన సాక్షి :

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రజా ప్రస్థానం, ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాన్ని జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆలేటి రమేష్ రచించిన “ప్రజలే కుటుంబం – ప్రజా సేవే ధ్యేయం – అభివృద్ధే లక్ష్యం” అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.

ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉప్పల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బండారి లక్ష్మారెడ్డి చేసిన కృషి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చొరవ, నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా సాగించిన ప్రయత్నాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలనే తన కుటుంబంగా భావిస్తూ, ప్రజాసేవనే ధ్యేయంగా, ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే సాగిస్తున్న మూడేళ్ల ప్రస్థానాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు ఆలేటి రమేష్ తెలిపారు.

ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానంతో పాటు ప్రజలతో ఆయనకున్న అనుబంధం, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను అక్షర రూపంలో పొందుపరచడమే ఈ పుస్తక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. “ప్రజలే కుటుంబం – ప్రజా సేవే ధ్యేయం – అభివృద్ధే లక్ష్యం” అనే సందేశంతో రూపొందిన ఈ పుస్తకం మూడు సంవత్సరాల ప్రజా ప్రస్థానానికి అక్షర సాక్ష్యంగా నిలవనుంది.

By : KISHOR, UPPAL

మరిన్ని వార్తలు