దూప దీప నైవేద్య భోగ్ బావోజీల వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్..!
నాగర్‌కర్నూల్ జిల్లా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి మద్దిమడుగులో గురువారం నూతనంగా నిర్మించనున్న శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం , ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం నుంచి భక్తులు, బంజారా సోదరులు సుమారు 100 వాహనాలలో పెద్ద ఎత్తునఎత్తున తరలివెళ్లారు.

దూప దీప నైవేద్య భోగ్ బావోజీల వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్..!
చింతపల్లి, మనసాక్షి : నాగర్‌కర్నూల్ జిల్లా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి మద్దిమడుగులో గురువారం నూతనంగా నిర్మించనున్న శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం , ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం నుంచి భక్తులు, బంజారా సోదరులు సుమారు 100 వాహనాలలో పెద్ద ఎత్తునఎత్తున తరలివెళ్లారు.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మద్దిమడుగుకు బయలుదేరిన దూపదీప నైవేద్య బావోజీల వాహనాలకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి నగార మ్రోగించి ప్రయాణాన్ని ప్రారంభించారు.
Also Read : వేడి వేడి మిర్చి చారు తింటే ఆ మజానే వేరు.. స్టార్ హోటల్ స్టైల్‌లో ఇలా తయారు చేసుకోండి..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. సంతు సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, బోధనలు బంజారా సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని, ఆయన చూపిన సత్యం, ధర్మం, ఐక్యత, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం మరియు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం బంజారా సమాజానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక ఆకాంక్షలకు గౌరవం ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం నుంచి బంజారా సోదరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బంజారా సంఘం ప్రతినిధులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









