Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలురంగారెడ్డి

శివ లింగానికి వెండి నాగపడగ బహుకరణ..!

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణంలోని 15వ వార్డు శివాలయం నగర్ కాలనీలో ఉన్న పురాతన శివాలయ దేవస్థానానికి భక్తులు వెండి నాగపడగను సమర్పించారు.

శివ లింగానికి వెండి నాగపడగ బహుకరణ..!

ఆలూరి సుమతి, రాజేందర్‌ రెడ్డి దంపతుల భక్తిభావం 

(ఆమనగల్లు – ఇమ్రాన్)

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణంలోని 15వ వార్డు శివాలయం నగర్ కాలనీలో ఉన్న పురాతన శివాలయ దేవస్థానానికి భక్తులు వెండి నాగపడగను సమర్పించారు.

ఆలూరి సుమతి, రాజేందర్‌రెడ్డి దంపతులు స్వామివారిపై తమకున్న భక్తిని చాటుకుంటూ వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన నాగపడగను ఆలయానికి బహుకరించారు. వారి కుమారుడు ఆలూరి చైతన్యరెడ్డి చేతుల మీదుగా భక్తుల సమక్షంలో ఆలయ పూజారులు చెరుకు శివకుమార్, చెరుకు అక్షయ్‌కుమార్‌లకు నాగపడగను అందజేశారు. బొజ్జ సతీష్‌రెడ్డి, బొజ్జ అనూషరెడ్డి, బొజ్జ శ్రీనికరెడ్డి, బొజ్జ అవ్యుక్త్‌రెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.

Also Read : Nalgonda : నల్గొండ డీఆర్వోకు కలెక్టర్ నివాళి

కార్తీక పౌర్ణమి వంటి పవిత్ర పర్వదినాన శివలింగానికి వెండి నాగపడగను సమర్పించడం పట్ల ఆలయ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తితో దేవుడికి సమర్పించిన ఈ కానుక ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చెక్కాల లక్ష్మణ్, కోట్ల వెంకటేష్, గాజుల రమేష్, గాజుల తిరుపతయ్య, చెక్కాల శోభ, గాజుల రామచంద్రమ్మ, బండ సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు