Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 1104 పోస్టులను భర్తీ చేయనున్నది. ఆ ఉద్యోగాలకు కావలసిన అర్హత, ఎంపిక , ఖాళీలు వివరాలు. ఈ విధంగా ఉన్నాయి తెలుసుకోండి.

 

రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ ఆర్ సి గోరఖ్ పూర్ అధికారిక సైట్ rrcgorakhpur.net ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

 

ధరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 3వ తేదీన ప్రారంభించగా 2023 ఆగస్టు 2వ తేదీన ముగియనున్నది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలో 1104 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

 

1. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

2. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

3. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

4. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

5. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

 

🟢 ఖాళీల వివరాలు :

మెకానికల్ వర్క్ షాప్ / గోరఖ్ పూర్ 411.

సిగ్నల్ వర్క్ షాప్ / గోరఖ్ పూర్ కాంట్ 63.

మెకానికల్ వర్క్ షాప్/ ఇజ్జత్ నగర్ 150.

డీజిల్ షెడ్/ ఇజ్జత్ నగర్ 60 .

క్యారేజ్ వ్యాగన్/ ఇజ్జత్ నగర్ 64 .

క్యారేజ్ వ్యాగన్/ లక్నో 155.

డీజిల్ షెడ్ / గోండా 90.

క్యారేజ్ వ్యాగన్/ వారణాసి 75.

బ్రిడ్జ్ వర్క్ షాప్ /గోరఖ్ పూర్ 35.

 

🟢 ధరఖాస్తులకు అర్హత:

 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి పూర్తి చేయాలి. అదేవిధంగా ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.

15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి . ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది.

 

🟢 ఎంపిక విధానం :

 

ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా ఉంటుంది. పదవ తరగతి కనీసం 50% మార్కులతో, ఐటిఐ .. రెండింటిలోనూ అభ్యర్థులు పొందిన మార్కులను సగటున లెక్కిస్తారు.

 

అభ్యర్థుల ప్రాసెసింగ్ ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు లేదు.