Suryapet : సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..!
అక్రమ రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఏదైనా అంశం ఉంటే ఎక్కడికి రమ్మన్నా తాను చర్చలకు వస్తానని చట్టాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చెల్లదని సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా దిగిన టీ ఆర్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

Suryapet : సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..!
సూర్యాపేట, మనసాక్షి :
అక్రమ రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఏదైనా అంశం ఉంటే ఎక్కడికి రమ్మన్నా తాను చర్చలకు వస్తానని చట్టాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చెల్లదని సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా దిగిన టీ ఆర్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
సూర్యాపేటలో ఉన్న వజ్రా టౌన్షిప్ సంబంధించి ఒక నేరాలకు కారణమైన మనిషి ఇప్పటికే అనేక వివాదాగ్రస్త నిర్ణయాలు తీసుకున్న ఒక దొరసాని మరొక వివాదానికి తెరలేపుతున్నదని రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నదని ఇది సరైనది కాదని ఉదయం 10 గంటల సమయంలో రిజిస్టార్ ను కలిసి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
అయినా అధికార పార్టీ నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కార్యాలయానికి వచ్చారని ఆరోపించారు.ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ ఇది అక్రమ రిజిస్ట్రేషన్ దీనిపైన ఎంత పెద్ద అధికారి ముందైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను మీకు అధికారం ఉంది కదా అని ఇలాంటి అక్రమాలు చేస్తే ప్రజలు అంగీకరించరని కార్యాలయం ముందు బైఠాయించారు.
జానయ్య యాదవ్ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదగడం ఇష్టం లేక రాష్ట్రంలో ముఖ్యమైన పాత్రను పోషించడం జీర్ణించు కోలేక ఎలాగైనా రాజకీయాల నుంచి తప్పించాలని ఉదేశ్యం తో అనేక రకాల చిక్కులు సృష్టించాలని ఆర్థికపరమైన ఇబ్బందులు పెట్టాలని కుట్రలో భాగంగా తన పైన ఈ దాడి జరుగుతుందని జానయ్య ఆరోపించారు. పోలీసులు జానయ్య మాట వినకుండా బలవంతంగా లాక్కుపోయారు. ఆ సమయంలో వట్టే జానయ్య యాదవ్ పోలీస్ దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు.
ఎక్కడికైనా వస్తానని చెబుతున్న వినకుండా పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిచి జానయ్యను అరెస్ట్ చేశారని టీ ఆర్ పి నాయకులు ఆరోపించారు. ఉదయం నుండి ధర్నాలో ఉండడం వల్ల జానయ్య అనారోగ్యం పాలయ్యారు. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో బీపీ పూర్తిగా పడిపోవడంతో సోమ్మసిల్లీ పడిపోయారు.
వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ రొజు జరిగిన సంఘటన అధికార పార్టీ దౌర్జన్యం కు పరాకాష్ట అని, ఈ సంస్కృతి మంచిది కాదని అధికారం ఇప్పుడు ఉండవచ్చు రేపు భవిష్యత్తు మాదే అనే విషయం మర్చిపోవద్దని జానయ్య అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు జాన య్యా వెంట అనుసరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది..
అ భూమి మాదే మేము ఎవరికీ అమ్మలేదు.
వజ్ర టౌన్ షిప్ లో భూమి ఉన్న యాజమాన్యం రిజిస్టర్ కార్యాలయం కు వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్బంగా నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమా జ్యోతి లు మాట్లాడుతూ అ భూమి మా కుటుంబ సభ్యులదని వెంచర్ చేసే సమయం లో కొంత భూమి విక్రయుంచిమాని మిగిలిన భూమిని ఎవరికీ విక్రయుంచలేదని కావాలనే వట్టే జానయ్య యాదవ్ గొడవ సృష్టిస్తన్నారని అన్నారు.










