Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి..!
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద సంఘటన జరిగింది. పిట్లం మండలం, గొల్లపల్లి వద్ద మంజీరా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.

కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి..!
మన సాక్షి, కామారెడ్డి :
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద సంఘటన జరిగింది. పిట్లం మండలం, గొల్లపల్లి వద్ద మంజీరా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మంజీరా నదికి ఈతకు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వారిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు అంత కిష్టాపూర్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.









