Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం “వన్ నేషన్ వన్ రేషన్ కార్డు” విధానాన్ని తీసుకొచ్చిన విషయం విధితమే. రేషన్ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా చౌక ధరల దుకాణాల ద్వారా వచ్చే రేషన్ తీసుకోవచ్చును. ఈ విధానాన్ని తీసుకువచ్చి పేదలకు ఎంతో మేలు చేసింది. వలస వెళ్లిన పేద కార్మికులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంది.

 

కొంతమంది రేషన్ కార్డును దుర్వివినియోగం చేస్తూ రెండు, మూడు కార్డులు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయంపై కేంద్రం దృష్టి పెట్టింది. దాంతో రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయడంపై దృష్టి సారించింది. ఈ విధానాన్ని తీసుకురావడంలో రేషన్ కార్డుకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశం.

 

కార్డుదారులకు గుడ్ న్యూస్ :

రేషన్ కార్డులకు కార్డుదారులకు ఆధార్ కార్డుతో లింకు చేయడానికి గతంలో జూన్ 30 గడువు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

 

రేషన్ కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డు , రేషన్ కార్డు తో ఆధార్ కార్డును అనుసంధానం తప్పనిసరి చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ముందుగా వాళ్ళ కార్డును డిజిటలైజేషన్ చేసి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

2. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

3. మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

4. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

5. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు , పాన్ కార్డు ,రేషన్ కార్డు ఇవి తప్పనిసరి అవసరం ఉంది. వీటన్నింటిని ఆధార్ కార్డుతో లింకు చేయడం వల్ల దుర్వినియోగం అయ్యే అవకాశం లేదు.

 

అందుకే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు – ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో పాటు రేషన్ కార్డు – ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం వల్ల ఇంకా అనుసంధానం చేసుకొని వాళ్లు లింకు చేసుకునే అవకాశం ఉంది..

 

రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ ఇలా చేయాలి.

 

ఆన్ లైన్ లో రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.

> పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం పోర్టల్ ను ఆన్ లైన్ లో ఓపెన్ చేయాలి.

> రేషన్ కార్డు.. ఆధార్ కార్డు లింక్ చేయాలనే దానిపై క్లిక్ చేయాలి.

> ఆ తర్వాత రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

> అనంతరం మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.

> ఆ తర్వాత ఓటిపి ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ పూర్తవుతుంది.