Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విషయంపై ధరణి పోర్టల్ ను కొత్తగా తీసుకువచ్చింది. ధరణి పోర్టల్ వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి.

 

ధరణి వల్ల భూ రికార్డులలో పేర్లు తప్పులు వచ్చాయని, ఆధార్ కార్డు నెంబర్లు తప్పు ఉన్నాయని, భూములు ఎక్కువ.. తక్కువ రికార్డుల్లో వచ్చాయని రాష్ట్రవ్యాప్తంగా రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

 

ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దాంతో ధరణిని పోర్టల్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ పై ఐదు మ్యాడ్యూల్స్ ను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.

 

జిల్లా కలెక్టర్ లాగిన్ చేసే విషయంతో పాటు తహసిల్దార్ సమక్షంలో మార్పులు చేసే అవకాశం కూడా తీసుకువచ్చింది. దీనివల్ల నకిలీ సర్వే నెంబర్లు ఉన్నా… ఒకవేళ ఒకే నెంబరు రెండుసార్లు నమోదైనా.. వాటిలో మార్పులు చేసేందుకు తహసిల్దార్ లాగిన్ లో సదుపాయం కల్పించారు.

 

🟢 ఎక్కువ మంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

2. Rythu : వర్షాలు లేకపోవడంతో .. ఆ రైతు పంట కాపాడుకునేందుకు ఇలా కురిపించాడు..!

3. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

4. TRAINS | నల్గొండ, మిర్యాలగూడలో ఇకపై ఆ.. రైళ్లు ఆగనున్నాయి..!

 

రైతులు భూమిలో కొంత భాగాన్ని విక్రయించినా.. కూడా ఆ రైతు ఖాతాలో పూర్తి విస్తీర్ణం యధావిధిగా కొనసాగుతోంది. తాజాగా ఇచ్చిన ఈ అవకాశంతో విక్రయించిన భూభాగాన్ని గుర్తించి మార్పులు చేసేందుకు జిల్లా కలెక్టర్ లాగిన్ లో అవకాశం కల్పించారు. అదే విధంగా సర్వే నెంబర్లు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించడం జరిగింది.

భూమి వినియోగంలో మార్పులు, భూములు, ఇళ్ల స్థలాల విషయంలో సర్వే నెంబర్లు లేకుంటే ఇచ్చే అవకాశం ఉంది.

మరో ముఖ్య విషయం… ఒకవేళ ఆధార్ కార్డు నెంబర్లు తప్పుగా అనుసంధానమైనట్లైతే వాటిని మార్పు చేసుకునే అవకాశాన్ని తహసిల్దార్ లాగిన్ లో చేసుకునే అవకాశం కల్పించారు. అంతే కాకుండా భూమి యజమానిది కాకుండా పొరపాటుగా ఇతర ఆధార్ కార్డు నెంబర్ అనుసంధానమైతే కూడా మార్పు చేసుకునే అవకాశం కల్పించారు.

 

పలు సంస్థలకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన తప్పులు ఉంటే కూడా జిల్లా కలెక్టర్ లాగిన్ లో మార్పులు చేసుకోవచ్చును. ఈ వెసులుబాటు వల్ల అనేక సమస్యలు తొలిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు