Miryalaguda : మిర్యాలగూడ లో నిద్రలోనే ముగ్గురు సజీవ దహనం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిద్రిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో చోటుచేసుకుంది.

Miryalaguda : మిర్యాలగూడ లో నిద్రలోనే ముగ్గురు సజీవ దహనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిద్రిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో చోటుచేసుకుంది. కలాల్ వాడకు చెందిన చంద్రకళ (50) తన మనవడు లక్ష్మణ్ (17) ప్రణతి (14) తో ఇంట్లో నిద్రిస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకోవడంతో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. పొగ, మంటలకు ఊపిరాడక నిద్ర లోనే ప్రాణాలు వదిలారు.
కలాల్ వాడకు చెందిన చంద్రకళ, సైదులు భార్యాభర్తలు. కాగా సైదులు అనారోగ్యంతో నెల రోజుల క్రితం చనిపోయాడు. చంద్రకళ పెద్ద కూతురు ధనమ్మ భర్త పదేళ్ల క్రితం చనిపోగా ధనమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది.
మూడు రోజుల క్రితం ధనమ్మ ఇళ్లల్లో పనిచేసేందుకు పూణే వెళ్ళింది. కాగా గురువారం రాత్రి చంద్రకళ మనవడు, మనవరాలు తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ కు అంటుకోగా మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనం అయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ధనమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి :
- Hyderabad : అమీర్ పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, పొగ..!
- Good News : తెలంగాణలో ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!
- WhatsApp : వాట్సాప్ లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా, ఇలా చెక్ పెట్టండి..వెరీ సింపుల్ సెట్టింగ్స్..!
- Ration Cards : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కొత్త పథకానికి ఆమోదం..!









