Miryalaguda : మిర్యాలగూడలో జైల్ భరో.. జూలకంటి అరెస్టు..!
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దార దత్తం చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించి సంపాదన కాపాడుకోవాలని ఏఐకేఎస్ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

Miryalaguda : మిర్యాలగూడలో జైల్ భరో.. జూలకంటి అరెస్టు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దార దత్తం చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించి సంపాదన కాపాడుకోవాలని ఏఐకేఎస్ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం జైల్ భరో కార్యక్రమ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ధర్నా చేస్తున్న జూలకంటి తో పాటు ఆయా సంఘాల నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కొరకు సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు.
బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను అమలు చేస్తూ ఉందని, అందులో భాగంగానే లేబర్ కోడ్ల అమలుకు ఫైనల్ రూల్స్ ను నోటిఫై చేసిందని అన్నారు. సులభతర వ్యాపారం పేరుతో పెట్టుబడిదారుల గరిష్ట లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసిందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని అన్నారు.
అంతేకాక కార్మికుల ప్రాథమిక హక్కు అయినా సమ్మెను కాలరాస్తూ దానిపై ఆంక్షలు విధించడమే కాక కార్మిక సంఘాల గుర్తింపు రిజిస్ట్రేషన్ కష్టతరం చేసింది అని అన్నారు. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ పథకాన్ని నీరు గార్చే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేష్, నాయకులు రవి నాయక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్, చేనేత కార్మిక సంఘం నాయకులు భావండ్ల పాండు, ఐద్వా నాయకురాలు గోవర్ధన, అరుణ, సైదమ్మ, అనసూర్య, హమపక్ష రైతు సంఘం నాయకులు బంటు వెంకటేశ్వర్లు, వసుక్కుల మట్టయ్య, టాప్రా నాయకులు జగదీష్ చంద్ర, సత్యనారాయణ రావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్ర నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్ నాయక్, సైదా నాయక్ పాల్గొన్నారు.










