Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్
చంచల్ గూడ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య..!
చంచల్ గూడలో జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి (22) మంగళవారం అతడిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు.

చంచల్ గూడ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
చంచల్ గూడలో జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి (22) మంగళవారం అతడిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల కళ్ళు గప్పి అక్కడ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి పారిపోయారు. ఆ తర్వాత అతడు వనపర్తి జిల్లా అమరచింతలోని సొంత ఊరు నందిమల్లకు చేరుకున్నాడు.
జైలు నుంచి అతడు పారిపోవడంతో అక్కడ పోలీసులు గస్తీ ఉండటం చూసి కిషోర్ కుమార్ భయాందోళనలకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక ఊరు చెరువు గట్టుపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడు జూలై 6వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి కూడా పరార్ కావడంతో అదే రోజు అతన్ని పట్టుకొని చంచల్ గూడ జైలుకు తరలించి రిమాండ్ లో ఉంచారు.









