Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం..  కొట్టుకుపోయిన రోడ్డు..!

సూర్యాపేట జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్ళమల్కాపురం నుండి కీతవారిగూడెం వెళ్లే రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద భారీ నీటి ప్రవాహం కారణంగా రోడ్డు కోతకు గురై పెద్ద గుంత పడింది.

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం..  కొట్టుకుపోయిన రోడ్డు..!

తాళ్ళమల్కాపురం – కీతవారిగూడెం రోడ్డు తాత్కాలిక మూసివేత

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన గరిడేపల్లి పోలీస్

గరిడేపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్ళమల్కాపురం నుండి కీతవారిగూడెం వెళ్లే రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద భారీ నీటి ప్రవాహం కారణంగా రోడ్డు కోతకు గురై పెద్ద గుంత పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజల భద్రతను దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

కీతవారిగూడెం మరియు పరిసర గ్రామాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు కొత్తగూడెం మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అన్నారు. ఈ రూట్ డైవర్షన్ (మార్పు) గురించి ఇప్పటికే గ్రామ ప్రజలకు అర్థమయ్యేలా టామ్-టామ్ ద్వారా చాటింపు వేయించాము. అలాగే వాహనదారుల సౌకర్యార్థం సదరు బ్రిడ్జి ప్రాంతంలో ఫ్లెక్స్ బ్యానర్లు మరియు సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

Also Readప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి..!

ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నది. ప్రజలు మరియు వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించి, ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

మరిన్ని వార్తలు