దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు సుప్రీంకోర్టులో చుక్క ఎదురయింది. ఆయన పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు సుప్రీంకోర్టులో చుక్క ఎదురయింది. ఆయన పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం ఆయన పిటిషన్ ని ధర్మాసనం విచారించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు ఎమ్మెల్యేగా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది.. ఎంపీగా షేర్ మార్కెట్లో అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఆ డిపాజిట్ పోయిందని అంటూ వ్యాఖ్యానించారు. దానం నాగేంద్ర పై తెలంగాణ హైకోర్టు విధించిన సుప్రీంకోర్టు సమర్పించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించింది.
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దానం నాగేందర్ ప్రకటించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాం అనేది తర్వాత చెబుతానని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రజల మద్దతు తమకే ఉంటుందని విశ్వాసం కూడా వ్యక్తం చేశారు.
MOST READ :
- గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామవత్ శంకర్ నాయక్ అకాల మరణం..!
- ధైర్యపురి తండ లడ్డు వేలం పాట రూ.1.26 లక్షలు.. దక్కించుకున్న సర్పంచ్. వాంకుడవత్ అనిత దాస్..!
- చంచల్ గూడ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య..!
- Suryapet : సూర్యాపేటలో గణేష్ లడ్డు వేలం పాట.. అత్యధికంగా 3.21 లక్షలకు దక్కించుకున్న బెలీదే శ్రీనివాస్ లు..!









