Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో గణేష్ లడ్డు వేలం పాట.. అత్యధికంగా 3.21 లక్షలకు దక్కించుకున్న బెలీదే శ్రీనివాస్ లు..! 

శ్రీ వేదాంత భజన మందిరం లో వినాయకుని విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన లడ్డూను సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలీదే శ్రీనివాస్ లు 3,21,000/- రూపాయలకు పాడి తన స్వంతం చేసుకున్నారు.

Suryapet : సూర్యాపేటలో గణేష్ లడ్డు వేలం పాట.. అత్యధికంగా 3.21 లక్షలకు దక్కించుకున్న బెలీదే శ్రీనివాస్ లు..! 

సూర్యాపేట, మనసాక్షి

శ్రీ వేదాంత భజన మందిరం లో వినాయకుని విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన లడ్డూను
సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలీదే శ్రీనివాస్ లు 3,21,000/- రూపాయలకు పాడి తన స్వంతం చేసుకున్నారు.

బుధవారం సూర్యాపేటలో వినాయకుని నిమజ్జనం సందర్భంగా పూల సెంటర్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల సందర్భంగా జరిగిన వేలంపాటలో రూ.3 లక్షల 17 వేల రూపాయల వరకు వెంపటి శబరినాద్ పాట పాడి నిష్క్రమించారు.

గత ఏడాది రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి లడ్డు వేలంపాట కాగా ఈ సంవత్సరం మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలిదే శ్రీనివాస్ అత్యధికంగా పాడి కైవసం చేసుకున్నారు.

Also Readఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి..!

శ్రీ వేదాంత భజన మందిరము కు లడ్డు ద్వారా అత్యధిక ఆదాయం సమకూర్చడం లో తనదైన శైలిలో పాట పాడి దేవాలయముకు ఆదాయం సమకూర్చడము లో బెలీదే శ్రీనివాస్ భాగస్వామ్యం అయ్యారు.

లడ్డు కైవసం చేసుకున్న శ్రీనివాస్ లు కు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి , రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది, మార్కెట్ చైర్మన్ వేనారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,తో పాటు పలువురు నేతలు, ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు