Breaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
స్వీట్ హౌస్, రెస్టారెంట్లు మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ
జహీరాబాద్ పట్టణంలోని పలు స్వీట్ హౌస్, రెస్టారెంట్లను మున్సిపల్ అధికారులు, ఆహార భద్రత అధికారులు గురువారం తనిఖీలు చేశారు.

స్వీట్ హౌస్, రెస్టారెంట్లు మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ
జహీరాబాద్, మన సాక్షి
జహీరాబాద్ పట్టణంలోని పలు స్వీట్ హౌస్, రెస్టారెంట్లను మున్సిపల్ అధికారులు, ఆహార భద్రత అధికారులు గురువారం తనిఖీలు చేశారు. స్వీట్ హౌస్ల లో ఎక్స్పైర్ అయిన మోతిచూర్ లడ్డు విక్రయిస్తున్నారని ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించారు. ఎక్స్పైర్ అయినా ఆహార పదార్థాలు విక్రయించవద్దని యజమానులకు సూచించారు. అలాగే పరిశుభ్రత పాటించాలన్నారు. రెస్టారెంట్లలో నిల్వ నిల్వచేసిన పదార్థాలు ఎక్కువ రోజులు ఉంచరాదన్నారు.. తనిఖీలలో మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సంధ్య, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులున్నారు.









