Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Srisailam : శ్రీశైలం కు తగ్గిన వరద.. జూరాల గేట్లు మూసివేత..!

కృష్ణా నది ఎగువ భాగంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో కృష్ణా నదిలో వరద తగ్గు ముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద తగ్గు ముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేశారు.

Srisailam : శ్రీశైలం కు తగ్గిన వరద.. జూరాల గేట్లు మూసివేత..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కృష్ణా నది ఎగువ భాగంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో కృష్ణా నదిలో వరద తగ్గు ముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద తగ్గు ముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. దాంతో శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878. 60 అడుగులకు చేరింది. సామర్థ్యం 215.05 లకు గాను 181.05ఎంసీల మీరు నిల్వ ఉంది.

జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో విద్యుత్ కేంద్రం నుంచి 44,219 మాత్రం విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం 36వేల 23 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుంది. కాగా శ్రీశైలంలో కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 60, 117 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ కు వదులుతున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు